తాత్త్విక – సంపుటి 1, సంచిక - 4

 





Comments

  1. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుని దాకా పయనం తాత్విక ఏప్రిల్ 2024 సంచిక
    "ఆటవిక న్యాయం" అనగానే మొరటైనది, విచక్షణ లేనిది, బలవంతుడిది అనేది సాధారణ అర్ధం‌‌. కానీ కొన్ని ఆటవిక తెగల్లోని న్యాయం మన ఆలోచనలకు కూడా అందని విధంగా మానవీయ కోణాల్ని కలగలుపుకుని ఉందంటేని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. గంగాధరం గారి వ్యాసం మనకు తెలియని ఆటవిక న్యాయాన్ని పరిచయం చేస్తుంది‌.

    ఆటవిక న్యాయం గురించి చర్చ వచ్చింది అంటే పక్కనే ఆధునిక న్యాయం ప్రసక్తి తప్పనిసరిగా వస్తుంది. సంపాదకీయం లోని ఆధునిక న్యాయం మనకు ఆ లోటును పూరిస్తుంది. వలసవాదాన్ని, పాశ్చాత్య ఆలోచనా ధోరణులను పుణికిపుచ్చుకున్న ఆధునికన్యాయం పైకి ఉదారంగా ను, ఉన్నత విలువలను కలిగిన దాని గాను కనిపిస్తో రాజ్యానికి ఎలాకొమ్ముకాస్తుందో, బలహీనుడికి రక్షణ ఇస్తున్నట్టుగా ఎలా నమ్మిస్తుందో సంపాదకీయంలో వివరించారు. వలస రాజ్యానికి ముందున్న న్యాయ వ్యవస్థల్లో కొన్ని ప్రత్యేక, ప్రాంతీయ పరిస్థితులకు ఎంతో కొంత ప్రాముఖ్యత ఉండిఉండవచ్చు, అంతేకాకుండా అక్కడ జరిగే (అ) న్యాయం బాహాటంగా ఉంటుంది. అందరూ ఆ అన్యాయాన్ని సులువుగా గ్రహిస్తారు. చాతయితే బహిరంగంగా ఎదిరిస్తారు లేకపోతే అంతరంగంలోనైనా ఎదిరిస్తారు. కానీ ఆధునిక న్యాయంలోని అన్యాయం ముసుగు వేసుకొని వుంటుంది. అన్యాయం జరిగినవారికి కూడా అన్యాయం జరిగిన విషయం తెలియదు. యజ్ఞం కధ గురించి ప్రస్తావన ఆధునిక న్యాయం స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది‌.

    వ్యక్తిని అఖండంతో అనుసంధానించేసేది అనే అర్ధం నుండి religion అనే పదం పుట్టిందని " Religion అనే పదానికి మతం, ధర్మం సమానార్ధకాలేనా" అనే వ్యాసంలో కల్లూరి భాస్కరం గారు వివరిస్తారు. ఇంకా రెలిజియన్, మతం, ధర్మం పదాలు పుట్టుక అర్ధాలు గురించి అనేక విషయాలను పరిచయం చేస్తూ ఆసక్తికరంగా సాగింది కల్లూరి భాస్కరం గారి వ్యాసం.

    ఏథెన్స్ పుర వీధుల్లో ఒక వ్యక్తి కనిపించిన వారందరినీ ప్రశ్నలు అడుగుతో పోతున్నాడు. అతని ప్రశ్నలు చాలామందికి చికాకు అసహనాన్ని కలుగజేస్తున్నాయి. మత పెద్దలు తీవ్ర కోపానికి గురయ్యాడు. అయినా కూడా అతని తీరు మారలేదు. గ్రీకు ఫిలాసఫీకి, పాశ్చాత్య తత్వశాస్త్రానికి పునాది వేసిన ఆ వ్యక్తి మరెవరో కాదు "సోక్రటీస్". ప్రశ్నించడం నేర్పిన సోక్రటీస్ అనే వ్యాసంలో తిరుపతిరావు గారు సోక్రటీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తారు.

    ఈ ప్రపంచం లో మనిషిని లొంగతీసుకున్న అత్యంత బలమైన శక్తి ఏమైనా ఉందంటే అది అహం లేక ఈగో. అలాంటి అహం యొక్క వివిధ పార్శ్వాలను తడుముతూ ఆలోచనాత్మకంగా సాగుతుంది రాణీ శివశంకర శర్మ గారి " నేను, ఇగోను గురించిన కొన్ని ఆలోచనలు" అనే వ్యాసం.


    కవిత్వం, దాని వెనుక దాగున్న స్వర తత్వాన్ని ఎంతో హృద్యంగా వివరిస్తారు శశిధర్ తమ "కవితా ఓ కవితా -2 నక్షంత్రాంతర్నిబిడ నిఖిలగానం " లో. శ్రీ శ్రీ కవిత్వాన్ని సమగ్రంగా ఆస్వాదించాలన్నా , అసలు కవిత్వం మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ వ్యాసం చదువవలసిందే. అసలు దీనిని ఒక పాఠ్యాంశం గా చేరిస్తే చాలా బావుంటుందనిపిస్తుంది. ఇంకా ఈ కవితా విమర్శలో సాంప్రదాయ విమర్శా పద్ధతిని వీడి ప్రత్యేక పద్ధతిని ఎందుకు ఎంచుకోవలసి వచ్చిందో తరువాత ఇచ్చిన వివరణలో తెలియజేశారు.

    ప్రకృతి నియమాలను ధిక్కరించి, శాస్త్ర సాంకేతికతల సహాయంతో ఒక ఆధునిక సూపర్ హ్యూమన్ ఆవిర్భావ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న "ట్రాన్స్ హ్యూమనిజమ్" యొక్క పర్యావసానాలు, నడిపించే శక్తులు గురించి ఎంతో వివరంగా తెలియజేశారు శ్యాం గారు తమ " ట్రాన్స్ హ్యూమనిజం-సామాజిక, తాత్విక ఉద్యమం - ఒక పరిచయం" అనే వ్యాసంలో.

    ద్రవ ఆధునిక వ్యవస్థల్లో పెట్టుబడీదారుడు స్థానిక స్థాయి నుండి దేశ సరిహద్దులను దాటి ప్రపంచ స్థాయిలో పెట్టుబడీదారుడుగా అవతరించడం వలన అతలాకుతలం అవుతున్న సామాన్యుడి జీవితం, భద్రతను కోల్పోతున్న దేశాలు, బలహీనమవుతున్న రాజకీయాలు, జావకారిపోతున్న ప్రేమలు, వ్యక్తిగత సంబంధాలు, విచ్ఛిన్నవుతున్న కుటుంబ వ్యవస్థ , జీవితం పట్ల ఒక బీతి, మృత్యువు పట్ల భీతి, నిఘా నీడలో జీవితం వంటి అనేక అంశాలను స్పర్శిస్తూ సాగుతుంది రాజ్యలక్ష్మి గారు రాసిన"ద్రవ వ్యవస్థ మరికొన్ని పార్శ్వాలు - బౌమనీయం ఆఖరి భాగం" .
    మన ఆలోచన సరళి, దృక్పథం ప్రత్యేకించి పాశ్చాత్య ధోరణి క్రమంగా ఒకవైపు జరుగుతో రావడానికి, అలా జరగడం వలన జీవితం మరింత యాంత్రికతకు లోనవడానికి మన మెదడు లోని కుడి ఎడమ అర్థగోళాల మధ్య జరిగే పోరులో ఒక అర్ధగోళం రెండవ అర్ధగోళం మీద ఆధిపత్యం సాధించడమే కారణమా అనే దిశగా రాసిన పరిశోధనాత్మక పుస్తకం "The master and his Emissary, The devided brain and the making of the western world " గురించి పరిచయం చేస్తుంది కృష్ణ ప్రసాద్ గారి " సవ్యాపసవ్యాలు" వ్యాసం.

    - ప్రియంవద

    ReplyDelete

Post a Comment